
బిజినెస్

మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి ఎల్లంపల్లి ప్రాజెక్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసి వినియోగంలోకి తీసుకొచ్చారని పేర్కొన్నారు. 2016 ఆగస్టు 4న ప్రాజెక్టు నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వచ్చిందని, నేటితో పదేళ్లు పూర్తయ్యాయని తెలిపారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పదేళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ ప్రాజెక్టు పూర్తి కాలేదని జీవన్ రెడ్డి విమర్శించారు. మహారాష్ట్రలో కూడా అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఒప్పందం సాధ్యం కాలేదని అన్నారు. కేసీఆర్ చొరవతో ఒప్పందం కుదిరిందని పేర్కొన్నారు. ప్రస్తుతం కన్నెపల్లి వద్ద నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నప్పటికీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్‌డీఎస్‌ఏను కారణంగా చూపుతూ ముందుకు వెళ్లడం లేదని ఆరోపించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!