
షోస్

తెలంగాణ శాసనసభ ఎథిక్స్ కమిటీ ఈ రోజు సమావేశం కానుంది. అసెంబ్లీ కమిటీ హాల్‌లో చైర్మన్ రేవూరి ప్రకాశ్‌రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ భేటీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి సంబంధించిన వ్యవహారంపై ప్రధానంగా చర్చించనున్నారు. సభలో ఎమ్మెల్యే కడియం శ్రీహరితో కౌశిక్‌రెడ్డి వ్యవహరించిన తీరుపై వచ్చిన ఫిర్యాదును స్పీకర్ ఎథిక్స్ కమిటీకి పంపిన విషయం తెలిసిందే.
ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని కమిటీ గతంలో కౌశిక్‌రెడ్డికి నోటీసులు జారీ చేసింది. తొలుత వివరణ ఇచ్చేందుకు అదనపు సమయం కోరిన ఆయన, అనంతరం తన సమాధానాన్ని కమిటీకి సమర్పించినట్లు సమాచారం. ఆ వివరణపై చర్చించి తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కమిటీ తన నివేదికను రానున్న అసెంబ్లీ సమావేశాల్లో సమర్పించేందుకు ఇప్పటికే గడువు పొందింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!