
క్రీడలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కొర్ర చందర్ లాల్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పవన్ కల్యాణ్ ప్రెస్ మీట్ జరిగిన రోజున సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అతను తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన తెలంగాణ పోలీసులు నిందితుడిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియాలో ఎవరైనా పరిమితులు దాటి వ్యాఖ్యలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!