

డీఎస్సీ అంశంపై చర్చకు రావాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మంత్రి నారా లోకేశ్ సవాల్ విసిరారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్‌లో స్పందించిన లోకేశ్.. జగన్ సమాధానం కోసం రెండో రోజు కూడా ఎదురుచూస్తున్నామని పేర్కొన్నారు. డీఎస్సీపై తమ వాదనను ప్రజల ముందు ఉంచేందుకు సిద్ధంగా ఉన్నామని, ఈ అంశంపై జగన్ నేరుగా చర్చకు రావాలని డిమాండ్ చేశారు.
తన పోస్టులో ‘వైఎస్సార్‌సీపీ డీఎస్సీపై తప్పుడు ప్రచారం’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను ఉపయోగించిన లోకేశ్.. జగన్ స్పందన కోసం ఎదురుచూస్తున్నట్లుగా మిస్టర్ బీన్‌కు సంబంధించిన మీమ్‌ను కూడా పంచుకున్నారు. డీఎస్సీ వ్యవహారంపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య రాజకీయ విమర్శలు కొనసాగుతున్న నేపథ్యంలో లోకేశ్ తాజా సవాల్ చర్చనీయాంశంగా మారింది. దీనిపై జగన్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది ఆసక్తికరంగా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!