

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కళ్యాణలక్ష్మి పథకంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. కళ్యాణలక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామన్న హామీని ప్రభుత్వం నెరవేర్చలేదని ఆరోపించారు. అంతేకాకుండా కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను క్రమంగా బలహీనపరిచి, భవిష్యత్తులో పూర్తిగా నిలిపివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని సీఎం రేవంత్‌రెడ్డిపై ఆరోపణలు చేశారు. ఈ పథకాలు ప్రారంభమై 12 ఏళ్లు పూర్తైన సందర్భంగా కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా ఈ వ్యాఖ్యలు చేశారు.
గత 12 ఏళ్లలో కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా 16.78 లక్షల పేద కుటుంబాలకు లబ్ధి చేకూరిందని కేటీఆర్ తెలిపారు. ఆడబిడ్డల వివాహ సమయంలో తల్లిదండ్రులపై పడే ఆర్థిక భారాన్ని తగ్గించడంలో ఈ పథకాలు కీలకంగా పనిచేశాయని పేర్కొన్నారు. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలను బలోపేతం చేయాల్సింది పోయి నీరుగార్చే ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు. 2014లో ప్రారంభమైన ఈ పథకాల ద్వారా ఇప్పటివరకు 16,78,347 కుటుంబాలు లబ్ధి పొందినట్లు తాజా నివేదికలు పేర్కొంటున్నాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!