12, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఓటర్ల జాబితాపై బీజేపీకి మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్

Writer: Shivani K 04:00 PM, 12 అక్టోబర్, 2026
ఓటర్ల జాబితాపై బీజేపీకి మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. ఎన్నికల సంఘాన్ని రాజకీయ పార్టీలకు అనుబంధ సంస్థగా భావించి మాట్లాడటం మానుకోవాలని హితవు పలికారు. ఓటర్ల జాబితా తయారీ, సవరణలు, ఓట్ల తొలగింపు పూర్తిగా భారత ఎన్నికల సంఘం పరిధిలోని రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ అని స్పష్టం చేశారు. ఓటర్ల జాబితాలో పేర్లు గల్లంతైతే తామే సిస్టమ్‌లో చేర్పిస్తామని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. ఓటు హక్కు విషయంలో రాజకీయాలకు తావులేకుండా అర్హులైన ప్రతి పౌరుడి హక్కును కాపాడాలని పేర్కొన్నారు. ఓట్ల తొలగింపునకు సంబంధించిన ఆధారాలను ప్రజల ముందుంచి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడుతున్నామని, బాధిత ఓటర్లను తీసుకువచ్చి వాస్తవాలను వెల్లడిస్తామని తెలిపారు.

ఓటర్ల జాబితా సవరణల్లో ఫామ్‌-6, ఫామ్‌-7 దరఖాస్తుల వినియోగంపై వచ్చిన ఆరోపణలను ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం సమగ్రంగా పరిశీలించాలని పొన్నం ప్రభాకర్ కోరారు. ముషీరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ కార్యకర్తలు ఫామ్‌-7 ద్వారా ఓట్ల తొలగింపునకు ఫిర్యాదులు చేశారా లేదా అన్నదానిపై రామచంద్రరావు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఓటు హక్కు అంశాన్ని మతపరమైన కోణంలోకి మళ్లించకుండా, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతపై ప్రజలకు నమ్మకం కలిగించాలని సూచించారు. అదే సమయంలో, కేంద్రంలో పదేళ్లకు పైగా అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణకు, రాష్ట్ర రైతాంగానికి చేసిన మేలుతో పాటు విభజన హామీల అమలుపై సమాధానం చెప్పాలని కోరారు. రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలను పక్కనపెట్టి అర్హులైన ప్రతి పౌరుడి ఓటు హక్కును పరిరక్షించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏపీలో మేయర్ రిజర్వేషన్లు ఖరారు.. ఏ నగరం ఎవరికంటే?

ఏపీలో మేయర్ రిజర్వేషన్లు ఖరారు.. ఏ నగరం ఎవరికంటే?

రైతుల కష్టాలకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం.. హరీశ్‌రావు ఫైర్

రైతుల కష్టాలకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం.. హరీశ్‌రావు ఫైర్

ఇంధన కేంద్రాలపై దాడులు నిలిపివేయాలని ట్రంప్ పిలుపు.. జెలెన్‌స్కీ ఏమన్నారంటే!

ఇంధన కేంద్రాలపై దాడులు నిలిపివేయాలని ట్రంప్ పిలుపు.. జెలెన్‌స్కీ ఏమన్నారంటే!

ఢిల్లీ నిరసనకు మద్దతు తెలిపిన నలుగురు మాజీ సీఎంలకు అశుతోష్ రంకా కృతజ్ఞతలు

ఢిల్లీ నిరసనకు మద్దతు తెలిపిన నలుగురు మాజీ సీఎంలకు అశుతోష్ రంకా కృతజ్ఞతలు

సింగరేణి కార్మికుల సమస్యలపై కేటీఆర్ పోరాటం
ట్యాగ్లు
పొన్నం ప్రభాకర్రామచంద్రరావుతెలంగాణ బీజేపీఓటర్ల జాబితాఓట్ల తొలగింపుఎన్నికల సంఘంఫామ్-6ఫామ్-7ఓటు హక్కుతెలంగాణ రాజకీయాలు
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

సింగరేణి కార్మికుల సమస్యలపై కేటీఆర్ పోరాటం

కాంగ్రెస్ ఎంపీ బిమోల్ అకోయిజంపై ఎఫ్‌ఐఆర్..

కాంగ్రెస్ ఎంపీ బిమోల్ అకోయిజంపై ఎఫ్‌ఐఆర్..

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ కీలక అడుగు
రాజకీయాలు

ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ కీలక అడుగు

ఊటీలో వెంకటేష్, కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ కొత్త షెడ్యూల్ ప్రారంభం
సినిమాలు

ఊటీలో వెంకటేష్, కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ కొత్త షెడ్యూల్ ప్రారంభం

‘రణబాలి’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో విజయ్‌తో కలిసి రష్మిక సందడి!
సినిమాలు

‘రణబాలి’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో విజయ్‌తో కలిసి రష్మిక సందడి!

ప్రపంచవ్యాప్తంగా ‘రామాయణం’ సందడి.. 40 భాషల్లో విడుదలకు సన్నాహాలు!
సినిమాలు

ప్రపంచవ్యాప్తంగా ‘రామాయణం’ సందడి.. 40 భాషల్లో విడుదలకు సన్నాహాలు!

నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
బిజినెస్

నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

సినీ ప్రయాణంపై అదితి రావు హైదరీ ఆసక్తికర వ్యాఖ్యలు..
సినిమాలు

సినీ ప్రయాణంపై అదితి రావు హైదరీ ఆసక్తికర వ్యాఖ్యలు..

మహిళా ప్రయాణికులకు రైల్వేలో ప్రత్యేక సదుపాయాలివే...
బిజినెస్

మహిళా ప్రయాణికులకు రైల్వేలో ప్రత్యేక సదుపాయాలివే...

అభిషేక్ ప్రపంచ స్థాయి సూపర్ ఓపెనర్: దినేశ్ కార్తీక్
క్రీడలు

అభిషేక్ ప్రపంచ స్థాయి సూపర్ ఓపెనర్: దినేశ్ కార్తీక్

భారత మార్కెట్లోకి వోల్వో ఈఎక్స్90 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ
బిజినెస్

భారత మార్కెట్లోకి వోల్వో ఈఎక్స్90 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ

బిహార్ SIRపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు...
జనరల్

బిహార్ SIRపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు...

సంజూ శాంసన్ వల్లే వైభవ్‌కు అవకాశాలు రావట్లేదు- అశ్విన్
క్రీడలు

సంజూ శాంసన్ వల్లే వైభవ్‌కు అవకాశాలు రావట్లేదు- అశ్విన్

ప్రభాస్‌ బర్త్‌డేకి ‘ఫౌజీ’ టీజర్‌ లేనట్టేనా?
సినిమాలు

ప్రభాస్‌ బర్త్‌డేకి ‘ఫౌజీ’ టీజర్‌ లేనట్టేనా?