
బిజినెస్

ఒడిశా, ఆంధ్రప్రదేశ్ మధ్య కొటియా గ్రామాల భూవివాదం మరోసారి తెరపైకి వచ్చింది. వివాదాస్పద కొటియా ప్రాంతంలోని 21 గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ప్రాంతం తమదేనని ఒడిశా, ఏపీ రాష్ట్రాలు వాదిస్తున్న నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది.
ఈ నేపథ్యంలో అక్టోబర్ 23న కొటియా ప్రాంతంలోని మూడు గ్రామాల్లో ఏపీ ఎన్నికల కార్యక్రమాలను నిర్వహించడంపై బీజేడీ అధినేత, మాజీ సీఎం నవీన్ పట్నాయక్ పార్టీ ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం రెండు రాష్ట్రాల మధ్య వివాదాన్ని మరింత పెంచే అవకాశముందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!