
జనరల్

రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు, డిలిమిటేషన్ బిల్లు సహా పలు కీలక బిల్లులను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశముంది. ఆగస్టు 13 వరకు కొనసాగే ఈ సమావేశాల్లో పలు ముఖ్య అంశాలపై చర్చలు జరగనున్నాయి.
సమావేశాలకు ముందు ఇవాళ ఉదయం 11 గంటలకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరగనుంది. ఉభయ సభల ఫ్లోర్ లీడర్లు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. నీట్ పరీక్ష అంశం, అయోధ్య విరాళాల వ్యవహారం వంటి విషయాలపై చర్చించాలని విపక్షాలు పట్టుబట్టే అవకాశం ఉండటంతో పార్లమెంట్ సమావేశాలు ఉత్కంఠభరితంగా మారనున్నాయి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!