

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నేతలతో జూమ్ సమావేశం నిర్వహించి ఎస్‌ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఆగస్టు 3 వరకు గడువు పొడిగించిన నేపథ్యంలో దీనిని అవకాశంగా తీసుకుని ప్రతి నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో మరింత చురుకుగా పనిచేయాలని సూచించారు. ఇప్పటికే 119 నియోజకవర్గాల్లో 489 సమావేశాలు నిర్వహించినప్పటికీ వెనుకబడిన ప్రాంతాల్లో నాయకులు వెంటనే పనితీరు మెరుగుపరచాలని స్పష్టం చేశారు.
మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇన్‌చార్జ్‌లు, కార్పొరేషన్ చైర్మన్లు క్షేత్రస్థాయిలోనే ఉండాలని, గాంధీభవన్ చుట్టూ తిరగకుండా ప్రజల్లోకి వెళ్లాలని సీఎం ఆదేశించారు. బీఎల్‌ఓ నివేదికలకంటే బీఎల్‌ఏ నివేదికలకు ప్రాధాన్యం ఇవ్వాలని, నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ నెల 30న మరోసారి పూర్తి స్థాయి సమీక్ష నిర్వహించి నియోజకవర్గాల వారీగా నివేదికలు పరిశీలిస్తామని తెలిపారు. ఉత్తమంగా పనిచేసే 100 మంది బీఎల్‌ఏలకు రాహుల్ గాంధీని కలిసే అవకాశం కల్పించాలని కూడా సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!