

మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) పార్టీకి చెందిన ఆరుగురు లోక్‌సభ ఎంపీలు ఉప ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే నేతృత్వంలోని అధికార శివసేనలో చేరారు. అనంతరం తమను షిండే వర్గం ఎంపీలుగా గుర్తించాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కోరారు. శివసేన (యూబీటీ)కి లోక్‌సభలో మొత్తం తొమ్మిది మంది ఎంపీలు ఉండగా, వారిలో ఆరుగురు షిండే వర్గంలోకి వెళ్లారు.
మరోవైపు, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద తిరుగుబాటు ఎంపీలను అనర్హులుగా ప్రకటించాలని ఉద్ధవ్ వర్గం స్పీకర్‌ను కోరింది. అయితే లోక్‌సభలో శివసేన (యూబీటీ) ఎంపీలలో మూడింట రెండొంతుల మంది షిండే వర్గంలో చేరినందున ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తించదని స్పీకర్ నిర్ణయించారు. దీంతో ఆరుగురు ఎంపీలను షిండే వర్గానికి చెందినవారిగా అధికారికంగా గుర్తించారు. ఈ నిర్ణయంతో ఉద్ధవ్ వర్గం బలం మూడు ఎంపీలకు తగ్గగా, షిండే వర్గం బలం 13 మంది ఎంపీలకు పెరిగింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!