

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, నటుడు పవన్ కల్యాణ్ తన మూడు పెళ్లిళ్ల గురించి గతంలో చేసిన వ్యాఖ్యలు మరోసారి వార్తల్లో నిలిచాయి. నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేసిన ‘అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే 2’ టాక్ షోలో 2023లో పాల్గొన్న సందర్భంగా తన వివాహాలపై వస్తున్న విమర్శలకు పవన్ స్పందించారు. తాను ముగ్గురిని ఒకేసారి వివాహం చేసుకోలేదని, ఒక్కో వివాహం వేర్వేరు సమయాల్లో జరిగిందని స్పష్టం చేశారు. గత వివాహాలు సజావుగా సాగకపోవడంతో విడాకుల అనంతరం మరో వివాహం చేసుకున్నట్లు వివరించారు.
తన వివాహాలు వేర్వేరు పరిస్థితుల్లో జరిగాయని, ఆ అనుభవాల్లో బాధ కూడా ఉందని పవన్ అప్పట్లో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో కూడిన ఎపిసోడ్ 2023 ఫిబ్రవరి 3న విడుదలైంది. తాజాగా పవన్ కల్యాణ్, ఆయన మూడో భార్య అన్నా కొణిదెల 13 ఏళ్ల వైవాహిక బంధం తర్వాత విడిపోతున్నట్లు ప్రకటించడంతో అప్పట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చకు వచ్చాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!