

వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ తన తల్లి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియా గాంధీ ఇటీవల విడుదల చేసిన ఆత్మకథ ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’కు గట్టి మద్దతు తెలిపారు. తన జీవిత అనుభవాలను, వాస్తవాలను పుస్తకం రూపంలో ప్రజలతో పంచుకునే హక్కు సోనియా గాంధీకి ఉందని స్పష్టం చేశారు. గత కొన్నేళ్లుగా భాజపా, ఆర్ఎస్ఎస్లు సోనియా గాంధీపై తప్పుడు ప్రచారం చేస్తూ, ఆమె గురించి కల్పిత కథనాలు వ్యాప్తి చేశాయని విమర్శించారు. ప్రస్తుతం వారంతా ఆమె పుస్తకాన్ని చదువుతున్నందుకు సంతోషంగా ఉందని ప్రియాంక వ్యాఖ్యానించారు.
వయనాడ్ పర్యటనలో భాగంగా మీడియాతో మాట్లాడిన ప్రియాంక గాంధీ.. విదేశీ మహిళ అనే పేరుతో భాజపా, ఆర్ఎస్ఎస్లు తన తల్లిని నిరంతరం విమర్శించినప్పటికీ, సోనియా గాంధీ ఇన్నాళ్లూ మౌనంగా ఉన్నారని గుర్తుచేశారు. ఇప్పుడు తన జీవితానికి సంబంధించిన వాస్తవాలను ఆమె స్వయంగా పుస్తకంలో వివరించారని తెలిపారు. ఇన్నాళ్లూ ఇతరులు తన తల్లి గురించి అసత్యాలు ప్రచారం చేస్తే, ఇప్పుడు ఆమె నిజాలను ప్రజల ముందుకు తీసుకొచ్చారని ప్రియాంక పేర్కొన్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!