

టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్విమ్స్ లో జరుగుతున్న ఉద్యోగ నియామకాలపై తీవ్ర ఆరోపణలు చేశారు. 303 పోస్టుల భర్తీకి విడుదల చేసిన నోటిఫికేషన్‌లో నిబంధనలను మార్చి కొందరికి అనుకూలంగా వ్యవహరించారని ఆయన ఆరోపించారు. అర్హతలు, అనుభవ ప్రమాణాలు, ఎంపిక విధానం, ప్రశ్నపత్రాల రూపకల్పనలో పారదర్శకత లేదని, ఈ నియామకాలు మరో డీఎస్సీ స్కాంను తలపిస్తున్నాయని విమర్శించారు. నోటిఫికేషన్‌ను వెంటనే రద్దు చేసి సమగ్ర విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ, టీటీడీలో కూడా ఉద్యోగ నియామకాల నుంచి వివిధ వ్యవహారాల్లో అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయని అన్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామికి కనీస ప్రోటోకాల్ దర్శనం కూడా కల్పించలేదని ఆయన విమర్శించారు. ప్రభుత్వ అనుమతి, బోర్డు ఆమోదం లేకుండా నియామకాలు, వేతనాల మార్పులు జరిగాయని ఆరోపిస్తూ, మొత్తం ప్రక్రియపై ప్రభుత్వం స్పందించి పారదర్శక విచారణ జరపాలని కోరారు. ఈ ఆరోపణలపై సంబంధిత అధికారుల నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!