12, నవంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

లంకేశ్, దభోల్కర్ హత్యల వెనుక సంఘ్.. ప్రియాంక్ ఖర్గే

Writer: G.Sreekanth Reddy 10:41 AM, 11 నవంబర్, 2026
లంకేశ్, దభోల్కర్ హత్యల వెనుక సంఘ్.. ప్రియాంక్ ఖర్గే

జర్నలిస్టు గౌరీ లంకేశ్‌, స్కాలర్ ఎంఎం కల్బుర్గి, హేతువాది నరేంద్ర దభోల్కర్‌ హత్యల వెనుక సంఘ్‌ పరివార్‌ హస్తం ఉందని కర్నాటక హోం మంత్రి ప్రియాంక్ ఖర్గే చేసిన ఆరోపణలకు మూడు రోజుల్లో ఆధారాలు చూపాలని లేకపోతే ఆయన రాజీనామా చేయాలని బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య డిమాండ్ చేశారు. సూర్య చేసిన డిమాండ్‌కు ఎక్స్‌లో ఖర్గే స్పందించారు.

ఆ హత్యలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌), సీబీఐ జరిపిన విచారణలో నిందితులకు ఆర్ఎస్ఎస్‌తో సంబంధాలున్న రహస్య నెట్‌వర్క్‌లతో లింకులు ఉన్నట్లు వెల్లడైందని ఖర్గే ఆరోపించారు. గోవింద్‌ పన్సారే హత్య కేసులోనూ ఇలాంటి సంబంధాలు బయటపడ్డాయని ఆయన పేర్కొన్నారు. అలాగే ఆర్ఎస్ఎస్‌కు రిజిస్ట్రేషన్‌ లేదని, సభ్యత్వ వివరాలు, ఆర్థిక లెక్కలు కూడా లేవని ఖర్గే అన్నారు. సంస్థను రిజిస్టర్‌ చేయించే ధైర్యం ఉందా అని తేజస్వి సూర్యకు ఆయన సవాల్‌ విసిరారు. రిజిస్ట్రేషన్‌ ఫీజు తానే చెల్లిస్తానని ఎద్దేవా చేశారు.

అంతకుముందు కేరళలోని కొచ్చిలో ముస్లిం యూత్‌ లీగ్‌ రాష్ట్ర సదస్సులో ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు. కల్బుర్గి, గౌరీ లంకేశ్‌, దభోల్కర్‌ హత్యల వెనుక సంఘ్‌ పరివార్ వ్యక్తులు ఉన్నారని ఆరోపించారు. ఆ కేసులు విచారణలో ఉన్నాయని, మరో ఆరు నెలల్లో దర్యాప్తు ప్రక్రియను పూర్తి చేసి, ఆ హత్యల్లో ప్రమేయమున్న వారందరినీ జైలుకు పంపిస్తానని ఆయన వ్యాఖ్యానించారు. గాంధీ హత్య వెనుక కూడా అవే శక్తులున్నాయని ఆరోపించారు.

ఖర్గే వ్యాఖ్యలపై తేజస్వి ఎక్స్‌లో స్పందించారు. గౌరీ లంకేశ్‌, ప్రొఫెసర్‌ కల్బుర్గి హత్య కేసుల్లో బాధితులకు న్యాయం చేయాల్సింది పోయి, కేరళలో రాజకీయ వేదికలపై ఆరోపణలు చేయడం ఏమిటని సూర్య ప్రశ్నించారు. కర్ణాటక హోం మంత్రిగా కేసుల విచారణను వేగవంతం చేసి చట్టప్రకారం న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత ఖర్గేపై ఉందన్నారు. న్యాయస్థానాల తీర్పులకు ముందే రాజకీయ వేదికలపై తీర్పులు ప్రకటించడం సరికాదని విమర్శించారు. గౌరీ లంకేశ్‌ హత్య కేసులో 2018లోనే చార్జిషీటు దాఖలైందని, 2022లో విచారణ ప్రారంభమైందని సూర్య గుర్తుచేశారు. ఇప్పటివరకు ఈ కేసును ఏడుగురు న్యాయమూర్తులు విచారించారని, నిందితులందరూ బెయిల్‌పై బయట ఉన్నారని పేర్కొన్నారు. కల్బుర్గి హత్య కేసులో 2026 సెప్టెంబరు నాటికి 139 మంది సాక్షుల్లో 33 మంది వాంగ్మూలాలే నమోదు చేశారని తెలిపారు. ఈ జాప్యానికి కారణాలేంటో హోం మంత్రి వెల్లడించాలని సూర్య డిమాండ్‌ చేశారు.


మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సోనియా గాంధీ ఆత్మకథ ఆధారంగా సినిమా తీస్తాను - జగ్గారెడ్డి

సోనియా గాంధీ ఆత్మకథ ఆధారంగా సినిమా తీస్తాను - జగ్గారెడ్డి

కంగనా ఇన్‌స్టా పోస్ట్‌తో రాజకీయ దుమారం

కంగనా ఇన్‌స్టా పోస్ట్‌తో రాజకీయ దుమారం

యూసీసీపై ఒవైసీ వ్యాఖ్యలకు ఎన్డీయే నేతల కౌంటర్

యూసీసీపై ఒవైసీ వ్యాఖ్యలకు ఎన్డీయే నేతల కౌంటర్

ఏపీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. నవంబర్ 14న రెండో శనివారం సెలవు యథాతథం

ఏపీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. నవంబర్ 14న రెండో శనివారం సెలవు యథాతథం

టీవీకే నేతలతో సీఎం విజయ్‌ అత్యవసర భేటీ

టీవీకే నేతలతో సీఎం విజయ్‌ అత్యవసర భేటీ

ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్

ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్

ట్యాగ్లు
కర్నాటకప్రియాంక ఖర్గేగౌరి లంకేశ్ఆర్ ఎస్ ఎస్బీజేపీఎంపీ తేజస్వి సూర్యసిట్సీబీఐ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
స్వచ్ఛ సర్వేక్షణ్ 2026: దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నేవీ ముంబై
జనరల్

స్వచ్ఛ సర్వేక్షణ్ 2026: దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నేవీ ముంబై

సౌదీ జెండా ఉన్న ఆయిల్ ట్యాంకర్‌పై దాడి..ముగ్గురు భారతీయ నావికులు సురక్షితం
జనరల్

సౌదీ జెండా ఉన్న ఆయిల్ ట్యాంకర్‌పై దాడి..ముగ్గురు భారతీయ నావికులు సురక్షితం

బిగ్‌బాస్ తెలుగు 10 డే 66: హౌస్‌లో మరచిపోలేని మధుర జ్ఞాపకాలు..
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 66: హౌస్‌లో మరచిపోలేని మధుర జ్ఞాపకాలు..

ఐపీఎల్‌లో జట్ల పెంపుపై బీసీసీఐ క్లారిటీ
క్రీడలు

ఐపీఎల్‌లో జట్ల పెంపుపై బీసీసీఐ క్లారిటీ

చెరువుల పునరుద్ధరణే లక్ష్యంగా హైడ్రా అడుగులు – కమిషనర్ ఏవీ రంగనాథ్
జనరల్

చెరువుల పునరుద్ధరణే లక్ష్యంగా హైడ్రా అడుగులు – కమిషనర్ ఏవీ రంగనాథ్

చెరువుల పునరుద్ధరణ చరిత్రాత్మక పరిణామం - ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
జనరల్

చెరువుల పునరుద్ధరణ చరిత్రాత్మక పరిణామం - ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

నగరాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత - నాగార్జున
జనరల్

నగరాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత - నాగార్జున

మణిరత్నం ‘ఇంజి వెల్లం’ విడుదల తేదీ ఖరారు
సినిమాలు

మణిరత్నం ‘ఇంజి వెల్లం’ విడుదల తేదీ ఖరారు

స్వచ్ఛ నగరంగా హైదరాబాద్..సీఎం రేవంత్ ప్రశంసలు
జనరల్

స్వచ్ఛ నగరంగా హైదరాబాద్..సీఎం రేవంత్ ప్రశంసలు

కేంద్ర మంత్రి సోనోవాల్ చేతుల మీదుగా విశాఖ పార్క్ ప్రారంభం
జనరల్

కేంద్ర మంత్రి సోనోవాల్ చేతుల మీదుగా విశాఖ పార్క్ ప్రారంభం

విద్యా రంగంలో మార్పులకు రేవంత్ సర్కార్ శ్రీకారం
జనరల్

విద్యా రంగంలో మార్పులకు రేవంత్ సర్కార్ శ్రీకారం

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు
జనరల్

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!