
రాజకీయాలు

జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డితో పార్టీ అధిష్ఠానం జరిపిన చర్చలు ఫలించలేదు. తన నిర్ణయాన్ని మార్చుకునే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ఎమ్మెల్యే పదవి తనకు గొప్ప విషయం కాదని, తాను తలుచుకుంటే క్షణాల్లో రాజకీయ సమీకరణాలు మారిపోతాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కడప జడ్పీ ఛైర్మన్ పదవిపై గతంలో హామీ ఇచ్చి, ఆ తర్వాత మాట తప్పారని ఆదినారాయణరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంలో తనకు జరిగిన అన్యాయంపై ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తన తదుపరి నిర్ణయాన్ని రేపు ప్రకటిస్తానని వెల్లడించారు. దీంతో ఆయన రాజకీయ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!