

తమిళనాడులో విద్యార్థులు, యువత కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ), వామపక్ష పార్టీల నిరసనల్లో పాల్గొనకుండా చూడాలని కళాశాలలకు జారీ చేసిన ఆదేశాలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఆగస్టు 17న ప్రభుత్వ ఆర్ట్స్, సైన్స్ కళాశాలల ప్రిన్సిపాళ్లకు కళాశాల విద్యా కమిషనర్ ఈ మేరకు ఉత్తర్వులు పంపారు. విద్యార్థులను నిరసనలకు దూరంగా ఉంచేందుకు పాఠశాల విద్య, ఉన్నత విద్యా విభాగాలు పోలీసులు, జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకోవాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.
అయితే ఈ ఉత్తర్వులపై రాజకీయ, విద్యార్థి వర్గాల నుంచి విమర్శలు రావడంతో తమిళనాడు ప్రభుత్వం వెంటనే వెనక్కి తగ్గింది. బుధవారం ఆ ఆదేశాలను అధికారికంగా ఉపసంహరించుకుంది. నీట్ లీకేజీకి వ్యతిరేకంగా CJP దేశవ్యాప్తంగా చేపట్టిన నిరసనలకు వామపక్ష పార్టీలు మద్దతు తెలిపిన నేపథ్యంలోనే ఈ ఆదేశాలు జారీ అయినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ నిర్ణయం వివాదాస్పదం కావడంతో యూటర్న్ తీసుకోవాల్సి వచ్చిందనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!