

ఓటరు జాబితా సవరణలో వెలుగులోకి వచ్చిన అంశాలపై తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు నమ్మకం ఉండాలంటే ఎన్నికల సంఘం స్వతంత్రత, పారదర్శకత కీలకమని ఆయన పేర్కొన్నారు. గత పది నెలల్లో ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి పలు నిర్ణయాలపై 14 సార్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారన్న వార్తలను ఆయన ప్రస్తావించారు. అయితే ఎన్నికల సంఘం మాత్రం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సహా నిర్ణయాలన్నీ ఏకగ్రీవంగా తీసుకున్నామని స్పష్టం చేసింది.
గోవాలో ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు అర్హులుగా గుర్తించిన 97 మంది ఓటర్ల పేర్లు తుది జాబితాలో చేరకపోవడంపై కూడా ఉత్తమ్ ప్రశ్నలు లేవనెత్తారు. ముందుగా తొలగించిన పేర్లను తిరిగి చేర్చేందుకు ECINet సాఫ్ట్‌వేర్‌లో రోల్‌బ్యాక్ సదుపాయం లేకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని ఎన్నికల సంఘం తెలిపింది. అనంతరం అర్హులైన వారిని తదుపరి నమోదు ప్రక్రియ ద్వారా చేర్చుతున్నట్లు గోవా చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వెల్లడించారు. పశ్చిమ బెంగాల్‌లో ఓటరు జాబితా సవరణకు సంబంధించి భారీ సంఖ్యలో అప్పీళ్లు దాఖలైన అంశాన్ని కూడా ఉత్తమ్ ప్రస్తావించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!