

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తన నూతన పార్టీ పేరును ‘పరివర్తన రాజనీతి పార్టీ’ (పీఆర్పీ)గా ప్రకటించారు. విజయవాడ వేదికగా పార్టీ పేరును వెల్లడిస్తూ రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. ‘కొత్త తరం.. కొత్త పార్టీ’ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లేందుకు ఆయన సిద్ధమయ్యారు. రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడమే లక్ష్యంగా ఈ పార్టీని ప్రారంభించినట్లు ప్రకటించారు.

యువతకు రాజకీయాల్లో ప్రాధాన్యం కల్పించడం, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయడం, రాష్ట్ర అభివృద్ధికి పెద్దపీట వేయడం తమ ప్రధాన లక్ష్యాలని విజయసాయిరెడ్డి గతంలో వెల్లడించారు. ఈ నేపథ్యంలో పరివర్తన రాజనీతి పార్టీ ద్వారా కొత్త రాజకీయ విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన భావిస్తున్నారు. కొత్త తరం నాయకత్వానికి అవకాశం కల్పిస్తామన్న నినాదంతో ప్రారంభమైన ఈ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎలాంటి పాత్ర పోషిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!