
క్రీడలు

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తరచూ విదేశీ పర్యటనల్లో ఉండటం, పార్లమెంట్‌లో అందుబాటులో లేకపోవడం వల్ల ఆయనపై భాజపా తీవ్ర విమర్శలు చేసింది. బీజేపీ జాతీయ ప్రతినిధి షెహజాద్ పూనావాలా ఆయనను వ్యంగ్యంగా “లీడర్ ఆఫ్ పర్యటన్” అని పేర్కొన్నారు. రాహుల్‌పై వ్యంగ్య పోస్టర్లను కూడా సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు.
దీనికి కాంగ్రెస్ పార్టీ దీటుగా స్పందిస్తూ రాహుల్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నాయకుడని, అనేక దేశాలు ఆయనను ఆహ్వానిస్తున్నాయని తెలిపింది. సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ సహా పలువురు ఆయనను సమర్థించారు. ఇదే సమయంలో లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ రెండేళ్లు పూర్తి చేసుకుని ప్రజల వాణి కోసం తన పోరాటం కొనసాగుతుందని తెలిపారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!