

పలు జిల్లాలకు చెందిన వైఎస్సార్‌సీపీ నేతలు పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల తీరుపై చర్చించారు. పార్టీ కేడర్ అంతా ఎంతో పట్టుదలతో, కసితో పోరాటం చేసిందని జగన్ ప్రశంసించారు. 2024 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే వైఎస్సార్‌సీపీ ఓటింగ్ శాతం పెరిగిందని, ఎన్ని అడ్డంకులు, అరాచకాలు ఎదురైనా పార్టీకి ప్రజల మద్దతు పెరిగిందని పేర్కొన్నారు.
ఎన్నికలు స్వేచ్ఛగా, సజావుగా జరిగి ఉంటే పార్టీకి మరింత భారీ ఓటింగ్ శాతం వచ్చేదని జగన్ అభిప్రాయపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం అక్రమాలకు పాల్పడిందని, ఎన్నికల్లో కొత్త తరహా అక్రమాలకు తెరతీసిందని ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ విజయం సాధించిన చోట్ల కూడా ఫలితాలను తారుమారు చేశారని విమర్శించారు. ఎన్నికల్లో జరిగిన అక్రమాలు బయటపడితే ప్రభుత్వం చిక్కుల్లో పడుతుందనే భయంతోనే ఈ చర్యలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ, అన్యాయాలు చేసిన చంద్రబాబు ఇప్పుడు నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందని జగన్ వ్యాఖ్యానించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!