

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి భయంతోనే వైకాపా ఎన్నికలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోందని తెదేపా ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ఆరోపించారు. సకాలంలో ఎన్నికలు నిర్వహించకుండా చేసి, రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర నిధులను అడ్డుకోవాలనే కుట్ర ఇందులో దాగి ఉందని విమర్శించారు. గురువారం మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతానికి పైగా రిజర్వేషన్లు కల్పించాలని తెదేపా, జనసేన, భాజపా కూటమి నిర్ణయించిందని కాలవ శ్రీనివాసులు తెలిపారు. బీసీలపై నిజమైన చిత్తశుద్ధి ఉంటే వైకాపా అధినేత జగన్ కూడా 34 శాతం రిజర్వేషన్లకు మద్దతు ప్రకటించాలని డిమాండ్ చేశారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించే విషయంలో వైకాపా ఎందుకు సహకరించడం లేదని ప్రశ్నించారు. వెనుకబడిన తరగతులకు మొదటి నుంచి అండగా నిలిచింది తెదేపానే అని పేర్కొన్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!