
షోస్

బిగ్ బాస్ తెలుగు 10లో త్రిగుణ్ గేమ్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతోంది. అతని వ్యవహారశైలిలో నెగెటివ్ క్వాలిటీస్ ఎక్కువగా కనిపిస్తున్నాయని కొందరు ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. సెలబ్రిటీ కంటెస్టెంట్లు అందరూ కలిసి కామనర్స్‌ను టార్గెట్ చేయాలని, కామనర్స్‌లో మంచి యూనిటీ ఉందని త్రిగుణ్ చెప్పినట్లు తెలుస్తోంది.
అంతేకాకుండా ‘నువ్వు వేస్ట్.. అలాంటి మాటలు’ అంటూ ఇతర కంటెస్టెంట్లను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నాడనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీంతో త్రిగుణ్ తన గేమ్‌ను తాను ఆడటంతో పాటు పక్క కంటెస్టెంట్లను కూడా రెచ్చగొట్టి పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాడా? అనే చర్చ జరుగుతోంది. మరి ఇది అతని గేమ్ స్ట్రాటజీలో భాగమా? రాబోయే రోజుల్లో అతని ఆటతీరు ఎలా ఉంటుందో చూడాలి.


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!