

బిగ్‌బాస్ అగ్నిపరీక్ష 2 చుట్టూ కొనసాగుతున్న చర్చల నేపథ్యంలో ఉప్పల్ బాలు మరోసారి వార్తల్లో నిలిచారు. తనను షోకు పిలిచి అవమానించారని గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. ఈ నేపథ్యంలో గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితంలో ఎదురైన కష్టాలు, సామాజిక ఒత్తిళ్లు, సన్నిహితులు దూరమైన సందర్భాలను బాలు గుర్తుచేసుకున్నారు. తనకు అండగా నిలిచిన స్నేహితులు, బంధువులు ఇతరుల మాటలు విని తనతో సంబంధాలు తెంచుకోవడం చాలా బాధ కలిగించిందని తెలిపారు.
చిన్నతనంలో తన తల్లి అనారోగ్యానికి గురైనప్పుడు ఆమెను దగ్గరుండి చూసుకున్న విషయాన్ని కూడా బాలు పంచుకున్నారు. తల్లికి జడ వేయడం, బట్టలు ఉతకడం, భోజనం పెట్టడం వంటి పనులను తానే స్వయంగా చేసుకున్నానని చెప్పారు. తన గురించి సమాజం చేసే వ్యాఖ్యలను పట్టించుకోనని, ఇతరుల అభిప్రాయాల ఆధారంగా తనను అంచనా వేయవద్దని కోరారు. తనను చూసి యువత ప్రేరణ పొందడం సంతోషంగా ఉందని, సమాజంలో తనను మంచి వ్యక్తిగా గుర్తించాలనేదే తన కోరిక అని పేర్కొన్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!