

బిగ్ బాస్ ఫేమ్ ఆర్జే కాజల్ సోషల్ మీడియాలో మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఓ రీల్‌పై భారీగా ట్రోలింగ్ జరిగింది. బిగ్ బాస్ షో సమయంలోనే కాజల్‌కు మిశ్రమ స్పందనలు వచ్చిన విషయం తెలిసిందే. షో నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆమె సోషల్ మీడియా పోస్టులపై విమర్శలు, ట్రోలింగ్ కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఆమె షేర్ చేసిన రీల్ కూడా తక్కువ సమయంలోనే వైరల్‌గా మారింది. అయితే దానికి వచ్చిన కామెంట్లలో ఎక్కువ శాతం నెగెటివ్‌గా ఉండటంతో కాజల్ బాధపడినట్లు తెలిపింది.
ఇటీవల ఏషనాగుల పాటకు కాజల్ ఓ స్పెషల్ రీల్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియోకు కొంతమంది పాజిటివ్‌గా స్పందించినప్పటికీ, నెగెటివ్ కామెంట్లు ఎక్కువగా వచ్చాయని ఆమె పేర్కొంది. కొందరు అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడంపై కాజల్ ఆవేదన వ్యక్తం చేసింది. ‘నేనూ మనిషినే కదా.. ఆ కామెంట్లు చూస్తే చాలా బాధగా అనిపించింది’ అంటూ తన భావాలను వెల్లడించింది. అయితే ఈ నెగెటివిటీని తనను మరింత బలంగా ముందుకు తీసుకెళ్లే ప్రేరణగా తీసుకుంటానని కాజల్ చెప్పినట్లు తెలుస్తోంది.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!