

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 పదకొండో వారంలోకి అడుగుపెట్టడంతో హౌస్‌లో ఉత్కంఠ మరింత పెరిగింది. ఇప్పటికే పది వారాలు పూర్తి కాగా, పదో వారం శ్వేతా ఎలిమినేట్ అయ్యారు. ఇక పదకొండో వారం నామినేషన్ల ప్రక్రియలో భాగంగా బిగ్ బాస్ సరికొత్త ట్విస్ట్ ఇచ్చారు. మాజీ కంటెస్టెంట్లు షాలిని, అపూర్వ, మిథిలేష్ రెడ్డి, దాక్షి గుత్తికొండ, ఝాన్సీ డిక్టేటర్లుగా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రత్యేక సింహాసనాలపై కూర్చొని ప్రస్తుత కంటెస్టెంట్ల ఆటతీరును విశ్లేషిస్తూ నామినేషన్లు చేశారు. ఈ క్రమంలో మిథిలేష్ రెడ్డి.. ముకేష్ స్నేహాన్ని వ్యాపార లావాదేవీలా చూస్తున్నాడని, ముఖ్యంగా సుధీర్ విషయంలో అతని ప్రవర్తన సరిగ్గా లేదని విమర్శించాడు. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. మరోవైపు వర్షిణి మైండ్‌సెట్, ప్రవర్తనపై అపూర్వ చేసిన వ్యాఖ్యలు కూడా హౌస్‌లో వివాదానికి దారితీశాయి.
ఇదిలా ఉంటే మంగళవారం ఎపిసోడ్‌లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మూడు వారాల క్రితం ఎలిమినేట్ అయిన రోహిత్ నాయుడు తిరిగి హౌస్‌లోకి రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అగ్నిపరీక్ష ద్వారా షోలోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక అభిమానులను సంపాదించుకున్న రోహిత్.. ఈసారి సాధారణ కంటెస్టెంట్‌గా కాకుండా గెస్ట్ డిక్టేటర్‌గా ఎంట్రీ ఇవ్వనున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. నామినేషన్లు, కొన్ని టాస్కుల్లో పాల్గొనే అవకాశం ఉన్నప్పటికీ కెప్టెన్సీ, విజేతగా నిలిచే అర్హత ఉండకపోవచ్చని సమాచారం. అయితే దీనిపై బిగ్ బాస్ నిర్వాహకుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. రోహిత్ రీఎంట్రీ నిజమైతే హౌస్‌లో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయి? ఎవరిని టార్గెట్ చేస్తాడు? అనేది ఆసక్తికరంగా మారింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!