

బిగ్ బాస్ తెలుగు 10 రెండో వారం నామినేషన్స్ ఎపిసోడ్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. తొలి వారంలో హౌస్‌లో పలు సందర్భాల్లో వాగ్వాదాలు, విభేదాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా రోహిత్, త్రిగుణ్ మధ్య నెలకొన్న విభేదాలు హౌస్‌లో చర్చనీయాంశంగా మారాయి. వీకెండ్ ఎపిసోడ్ తర్వాత కూడా వీరి గేమ్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి కొనసాగుతోంది. దీంతో రెండో వారం నామినేషన్స్‌లో ఎవరు ఉంటారనే ఉత్కంఠ నెలకొంది.
రెండో వారం నామినేషన్స్‌లో భాగంగా బిగ్ బాస్ కంటెస్టెంట్లకు రోప్ టాస్క్ ఇచ్చారు. తాడును పూర్తిగా విప్పిన అనంతరం, హౌస్‌లో కొనసాగేందుకు అర్హత లేరని భావించిన ఇద్దరు కంటెస్టెంట్లను ఒక్కొక్కరు నామినేట్ చేయాల్సి వచ్చింది. ఈ ప్రక్రియ పూర్తయ్యే సరికి మొత్తం 11 మంది కంటెస్టెంట్లు నామినేషన్స్‌లో నిలిచారు. వారిలో రోహిత్, త్రిగుణ్, దేబ్జానీ, ఝాన్సీ, కృష్ణుడు, వర్షిణి, సృష్టి, ముఖేష్, షాలిని, సుధీర్, రామ్ ప్రసాద్ ఉన్నారు. మరోవైపు నరేష్, అమన్, వంశీ ఈ వారం నామినేషన్స్ నుంచి తప్పించుకున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!