

బిగ్‌బాస్ తెలుగు 10 రెండో వారంలోకి అడుగుపెట్టిన వెంటనే హౌస్‌లో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తొలి వారం మిడ్ వీక్ ఎలిమినేషన్‌లో బయటకు వెళ్లిన చరణ్.. ప్రేక్షకుల ఓట్ల ఆధారంగా మళ్లీ హౌస్‌లోకి రీ-ఎంట్రీ ఇచ్చాడు. గేటు తెరుచుకుని చరణ్ లోపలికి రావడంతో హౌస్‌మేట్స్ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. కొందరు అతడిని సంతోషంగా ఆహ్వానించగా, మరికొందరు అతని రాకతో తమ గేమ్‌పై ఎలాంటి ప్రభావం పడుతుందోనని ఆలోచించారు.
చరణ్ రీ-ఎంట్రీతో బిగ్ బాస్ మరో కీలక టాస్క్‌ను ముందుకు తెచ్చాడు. కెప్టెన్సీ కంటెండర్ రేసులో ఉన్న వారిలో ఒకరిని ఛాలెంజ్ చేసి, విజయం సాధిస్తే ఆ స్థానాన్ని దక్కించుకునే అవకాశం చరణ్‌కు ఇచ్చాడు. దీంతో అతను త్రిగుణ్‌ను ఛాలెంజ్ చేశాడు. త్రిగుణ్ హౌస్‌లో ఇతరులను మాట్లాడనివ్వకుండా వ్యవహరిస్తున్నాడని, అతను కెప్టెన్ కాకుండా అడ్డుకోవాలనే ఉద్దేశంతో ఛాలెంజ్ చేస్తున్నట్లు చరణ్ చెప్పాడు. అయితే టాస్క్‌లో చరణ్ వ్యూహాత్మకంగా ఆడేందుకు ప్రయత్నించినప్పటికీ, బిగ్ బాస్ సూచించిన నిబంధనలను పూర్తిగా పాటించలేకపోయాడు. దీంతో త్రిగుణ్‌ను విజేతగా ప్రకటించిన బిగ్ బాస్.. అతని కెప్టెన్సీ కంటెండర్ స్థానాన్ని కొనసాగించాడు. ఇక చరణ్ రాకతో హౌస్‌లో ఉన్న గ్రూప్ డైనమిక్స్ ఎలా మారతాయి, అతను ఎవరితో కలిసి ఆడతాడు, పాత స్నేహాలు కొనసాగుతాయా లేదా కొత్త విభేదాలు మొదలవుతాయా అనేది ఆసక్తికరంగా మారింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!