

‘బిగ్‌బాస్ తెలుగు’ 10వ సీజన్ సందడికి రంగం సిద్ధమైంది. తొమ్మిది సీజన్లతో ప్రేక్షకులను అలరించిన ఈ రియాలిటీ షో.. ఈసారి ‘దశావతారం’ అనే కొత్త కాన్సెప్ట్‌తో మరింత గ్రాండ్‌గా రాబోతోంది. అక్కినేని నాగార్జున మరోసారి హోస్ట్‌గా వ్యవహరించనుండగా, సెప్టెంబర్ 6 నుంచి సీజన్ ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, కంటెస్టెంట్లుగా పలువురు సెలబ్రిటీల పేర్లు వినిపిస్తున్నాయి. దేబ్జానీ, ‘గుప్పెడంత మనసు’ ఫేమ్ ముఖేష్ గౌడ, యాంకర్ వర్షిణి, జబర్దస్త్ కమెడియన్లు రామ్ ప్రసాద్, నరేష్, నటుడు కృష్ణుడు, చైత్ర రాయ్, యాంకర్ సుధీర్ రెడ్డి, టెంపర్ వంశీ, అదిత్ ఈశ్వరన్ పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. అయితే వీరిలో ఎంతమంది హౌస్‌లోకి అడుగుపెడతారనేది అధికారిక ప్రకటన తర్వాతే స్పష్టత రానుంది.
మరోవైపు కామనర్ కంటెస్టెంట్ల ఎంపికపైనా ఆసక్తి నెలకొంది. గత సీజన్‌లో కామనర్‌గా ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ పడాల విజేతగా నిలవడంతో ఈసారి సామాన్యులపై మరింత ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ‘అగ్నిపరీక్ష సీజన్ 2’లో టాప్ 15లో నిలిచిన రాజకుమారి, శ్రష్టి, ఝాన్సీ, అపూర్వ, షాలిని, ప్రియాంక, గాయత్రి, రోహిత్ నాయుడు, అమన్, హేమంత్, చరణ్, మిథిలేష్, రామకృష్ణ, దీపక్ తదితరుల్లో టాప్ 5గా నిలిచిన వారిని బిగ్‌బాస్ హౌస్‌లోకి పంపనున్నట్లు సమాచారం. అయితే వైరల్ అవుతున్న జాబితాలో చివరి నిమిషంలో మార్పులు జరిగే అవకాశం ఉండటంతో అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!