

బిగ్‌బాస్ తెలుగు 10లో 18వ రోజు ఎపిసోడ్ ఆసక్తికర పరిణామాలతో సాగింది. అపూర్వ, మిథిలేష్, రామకృష్ణ సర్‌ప్రైజ్ ఎంట్రీ ఇచ్చారు. వీరు గతంలో కంటెస్టెంట్ల గురించి రాసిన కామెంట్లను బిగ్‌బాస్ ఇంటి సభ్యులకు చూపించిన విషయం తెలిసిందే. అయితే ఆ కామెంట్లు ఎవరు రాశారో కంటెస్టెంట్లకు తెలియదు. తమ గురించి బయట కూడా ఇలాగే అనుకుంటున్నారా, ఇవి ప్రేక్షకుల అభిప్రాయాలా అంటూ కొందరు కంటెస్టెంట్లు భావోద్వేగానికి గురయ్యారు. చివరకు ఆ ముగ్గురూ ఇంటి గేటు వద్దకు రావడంతో కంటెస్టెంట్లు ఆశ్చర్యపోయారు.
మరోవైపు ఇంట్లో మూడో వారం కెప్టెన్సీ కంటెండర్ టాస్కులు కొనసాగాయి. నరేష్, వంశీ ఇద్దరిలో ముందుగా బజర్‌ను ఎవరు తాకారనే విషయంలో త్రిగుణ్ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. తొలుత నరేష్ పేరు చెప్పిన త్రిగుణ్.. ఆ తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకుని వంశీ ముందుగా బజర్‌ను తాకాడని ప్రకటించాడు. తన నిర్ణయం తప్పైతే శిక్షను స్వీకరిస్తానని చెప్పాడు. అనంతరం వంశీ, ఝాన్సీ మధ్య జరిగిన టాస్కులో ఝాన్సీ విజయం సాధించి కెప్టెన్సీ కంటెండర్‌గా నిలిచింది. ఆమెకు కుటుంబ సభ్యుల ఫొటో కూడా లభించింది. వచ్చిన అవకాశంతో నరేష్‌కు చెందిన లేఖను చింపేసింది.
ఆ తర్వాత బిగ్‌బాస్ గార్డెన్ ఏరియాలోకి పెద్ద మొత్తంలో ఆహారాన్ని పంపించారు. అందరూ భోజనం చేసిన అనంతరం మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఒక్కో కంటెస్టెంట్ గురించి రాసిన కామెంట్లు తెరపై కనిపించాయి. ఝాన్సీ ఉద్దేశాలు, ముఖేష్ ఆటతీరు, షాలినీ ప్రవర్తన, వంశీ ఆట, రామ్ ప్రసాద్ వ్యూహం, నరేష్ ప్రవర్తన, త్రిగుణ్ వ్యవహారశైలి, వర్షిణి ప్రభావం, సుధీర్ ఆటతీరుపై కామెంట్లు వచ్చాయి. దీంతో పలువురు కంటెస్టెంట్లు భావోద్వేగానికి గురికాగా, ఇంట్లో చర్చలు మొదలయ్యాయి.
చివరగా అపూర్వ, మిథిలేష్, రామకృష్ణలలో ఎవరు బిగ్‌బాస్ ఇంట్లోకి రావాలనే విషయంపై రహస్య ఓటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మిథిలేష్, రామ్ ప్రసాద్, త్రిగుణ్ ఆటతీరుపై ప్రశ్నలు సంధించాడు. అమన్‌ను తొలగించిన తీరు తనకు వ్యూహాత్మకంగా అనిపించిందని రామ్ ప్రసాద్‌ను ఉద్దేశించి చెప్పాడు. అలాగే రోహిత్‌ను స్టెరాయిడ్స్‌తో పోల్చడం, ముఖేష్‌పై చేసిన వ్యాఖ్యలను మిథిలేష్ తప్పుబట్టాడు. త్రిగుణ్‌తో తెలుగు భాషపై జరిగిన వాదన కూడా ఆసక్తికరంగా మారింది. మరోవైపు రామకృష్ణ నిజాయితీగా కనిపిస్తున్నాడని కొందరు కంటెస్టెంట్లు అభిప్రాయపడ్డారు. రహస్య ఓటింగ్‌తో ఎపిసోడ్ ముగిసింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!