

వినాయక చవితి సందర్భంగా బిగ్‌బాస్ తెలుగు సీజన్-10 ఆదివారం ఎపిసోడ్‌ను హోస్ట్ నాగార్జున శుభాకాంక్షలతో ప్రారంభించారు. కంటెస్టెంట్లు ఎక్కువగా ఇంగ్లిష్‌లో మాట్లాడటంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన.. ప్రేక్షకుల కోసం వీలైనంత వరకు తెలుగులో మాట్లాడాలని సూచించారు. తెలుగు సరిగా రాకపోయినా మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్న దేబ్జానీని ప్రత్యేకంగా అభినందించారు. కంటెస్టెంట్ల మనసులో ఎవరు ఉన్నారో తెలుసుకునే టాస్క్‌లో దేబ్జానీకి ఎక్కువ మంది మద్దతు తెలపడంతో ఆమెను నాగార్జున సరదాగా అభినందించారు. మరోవైపు రోహిత్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ఎపిసోడ్‌లో బ్లాక్ కీ కొత్త ట్విస్ట్‌ను తీసుకొచ్చింది. బ్లాక్ కీ ఎవరికి ఇస్తే.. వారి వద్ద ఉన్న కీ పవర్ పనిచేయదని నాగార్జున వివరించారు. ఎక్కువ మంది సృష్టి పేరును సూచించడంతో చివరకు బ్లాక్ కీ ఆమెకు ఇచ్చారు. అనంతరం బ్లాక్ బాక్స్ టాస్క్‌లో సుదీర్ విజయం సాధించడంతో సృష్టి తన బ్లాక్ కీని అతడికి అందించింది. ఎలిమినేషన్ ప్రక్రియలో సుదీర్, వర్షిణి, కృష్ణుడు హౌస్‌మేట్స్‌గా ఎంపికయ్యారు. సినిమా టాస్క్‌లో కృష్ణుడు టీమ్ గెలవగా.. కాఫీ కోసం దేబ్జానీ తన వ్యక్తిగత సీక్రెట్‌ను వెల్లడించింది. వచ్చే వీకెండ్ పూర్తిగా ప్రేక్షకుల చేతుల్లో ఉంటుందని నాగార్జున చెప్పడంతో తదుపరి ఎపిసోడ్‌పై ఆసక్తి పెరిగింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!