

బిగ్‌బాస్ తెలుగు 10 రెండో వారం ఎలిమినేషన్ రేసు ఆసక్తికరంగా మారింది. రోహిత్, త్రిగుణ్, ముఖేష్ గౌడ, రాంప్రసాద్, దేబ్జానీ, శాలిని, ఝాన్సీ, సృష్టి, సుధీర్, వర్షిణి, కృష్ణుడు నామినేషన్స్‌లో ఉన్నారు. అనధికారిక ఓటింగ్ ట్రెండ్స్, పోల్స్ ప్రకారం నటుడు కృష్ణుడు ప్రస్తుతం చివరి స్థానంలో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఓటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి పెద్దగా మార్పు లేకుండా డేంజర్ జోన్‌లోనే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ వారాంతపు ఎపిసోడ్‌లో కృష్ణుడు ఎలిమినేట్ కావచ్చనే టాక్ వినిపిస్తోంది. అయితే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఈ సమాచారం ఖరారు కాలేదని గమనించాలి.
‘వినాయకుడు’ చిత్రంతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న కృష్ణుడు.. ఆ తర్వాత పలు సినిమాల్లో కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించారు. బిగ్‌బాస్ హౌస్‌లో తన ఉనికిని బలంగా చాటుకోవడంలో కొంత వెనుకబడటంతో ఓటింగ్‌లో ప్రభావం పడిందనే చర్చ జరుగుతోంది. టాస్కులు, ఎంటర్‌టైన్‌మెంట్, హైలైట్ మూమెంట్స్‌లో పెద్దగా కనిపించకపోవడం కూడా ఇందుకు కారణమని సోషల్ మీడియా చర్చల్లో పేర్కొంటున్నారు. మరోవైపు రెండో వారంలో డబుల్ ఎలిమినేషన్ ఉంటుందనే ప్రచారం జరిగినప్పటికీ.. తాజా అనధికారిక సమాచారం ప్రకారం ఒక్క కంటెస్టెంట్‌ను మాత్రమే ఎలిమినేట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తుది నిర్ణయం మాత్రం వీకెండ్ ఎపిసోడ్‌లోనే వెల్లడికానుంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!