

బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ ఆసక్తికరమైన మలుపులు, హోరాహోరీ పోటీలు, వరుస గొడవలతో సాగుతోంది. హౌస్‌లో కెప్టెన్సీ టాస్కులు ప్రారంభం కావడంతో కంటెస్టెంట్ల మధ్య పోటీ మరింత తీవ్రంగా మారింది. వేర్వేరు టీమ్స్‌గా విడిపోయిన కంటెస్టెంట్లు టాస్కుల్లో సత్తా చాటేందుకు ప్రయత్నిస్తుండగా.. మరోవైపు వ్యక్తిగత విభేదాలు, గ్రూపిజం కూడా బయటపడుతున్నాయి. నామినేషన్ల ప్రక్రియ పూర్తవడంతో ఎలిమినేషన్ నుంచి బయటపడేందుకు కంటెస్టెంట్లు తమ ఆటను మరింత పదును పెడుతున్నారు. రోహిత్-షాలిని మధ్య వివాదం, త్రిగుణ్-అమన్ మధ్య జరిగిన ఘర్షణ హౌస్‌లో వాతావరణాన్ని మరింత వేడెక్కించాయి.
ఇదిలా ఉండగా.. కొందరు లేడీ కంటెస్టెంట్లు ‘ఉమెన్ కార్డ్’ ఉపయోగిస్తూ సింపతి గేమ్ ఆడుతున్నారంటూ సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా సృష్టి, వర్షిణి, షాలిని పేర్లు ఈ చర్చలో వినిపిస్తున్నాయి. కొన్ని సంఘటనల తర్వాత సృష్టి భావోద్వేగానికి గురికావడం, వీకెండ్ ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున మందలించిన అనంతరం కన్నీళ్లు పెట్టుకోవడం చర్చకు దారితీసింది. అలాగే అమన్‌తో టాస్క్ సమయంలో వాగ్వాదం అనంతరం వర్షిణి భావోద్వేగానికి గురికావడం కూడా సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. మరోవైపు అపూర్వ, దేబ్జానీ, ఝాన్సీ వంటి కంటెస్టెంట్లు టాస్కుల్లో పట్టుదలగా పోటీపడుతూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. మొత్తంగా ఈ సీజన్‌లో కంటెస్టెంట్ల ఆటతో పాటు వారి గొడవలు, భావోద్వేగ స్పందనలు కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!