

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 పదో వారంలో డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని ప్రేక్షకులు భావించినప్పటికీ, చివరకు శ్వేత ఒక్కరే ఎలిమినేట్ అయ్యారు. ఎలిమినేషన్‌కు ముందు సుధీర్, రామ్ ప్రసాద్, శ్వేత డేంజర్ జోన్‌లో ఉండగా.. శ్వేత బయటకు వెళ్లాల్సి వచ్చింది. ఆమె హౌస్‌ను వీడుతున్న సమయంలో అమన్ వెక్కివెక్కి ఏడ్చాడు. స్టేజ్‌పైకి వచ్చిన శ్వేత తన జర్నీని చూసుకుని భావోద్వేగానికి గురైంది. అనంతరం నాగార్జున ఇచ్చిన టాస్క్‌లో భాగంగా సూపర్ మార్కెట్ నుంచి మూడు వస్తువులను ఎంచుకుని వాటిని ముగ్గురు కంటెస్టెంట్లకు అంకితం చేసింది. అమన్‌ను తెలివైన, స్వచ్ఛమైన మనసున్న వ్యక్తిగా అభివర్ణిస్తూ.. ఆటలో మరింత వ్యూహాత్మకంగా వ్యవహరించాలని, ఇతరుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అతడే టైటిల్ గెలవాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. దేబ్జానీకి సొంత వ్యక్తిత్వాన్ని చాటుకోవాలని, ఇతరులపై ఆధారపడకుండా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పింది. ముకేష్ తన ఆటను తానే దెబ్బతీసుకుంటున్నాడని, ఇతరులు ఇచ్చే సలహాలను స్వీకరించి తన ఆటను మెరుగుపరుచుకోవాలని సూచించింది.
ఇక పదకొండో వారం ‘డిక్టేటర్స్’ థీమ్‌తో సాగనుందని నాగార్జున హింట్ ఇచ్చారు. గతంలో ఎలిమినేట్ అయిన మిథిలేష్, షాలినీ, అపూర్వ, ఝాన్సీ, చరణ్, రోహిత్, చైత్ర తదితరులు తిరిగి హౌస్‌లోకి వచ్చి నామినేషన్ల ప్రక్రియలో పాల్గొనే అవకాశం ఉన్నట్లు సమాచారం. వీరిలో కొంతమంది వారం రోజుల పాటు హౌస్‌లో అతిథులుగా ఉండటమే కాకుండా, డిక్టేటర్లుగా వ్యవహరిస్తూ ఆటను ప్రభావితం చేయనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రోహిత్ తిరిగి వస్తే త్రిగుణ్‌తో మళ్లీ విభేదాలు తలెత్తుతాయా? షాలినీతో కలిసి గతంలో అనుసరించిన ఆటతీరునే కొనసాగిస్తాడా? అనే ఆసక్తి నెలకొంది. కొత్త థీమ్‌తో హౌస్‌లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో చూడాలి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!