

సింగర్ ఝాన్సీ బిగ్‌బాస్ తెలుగు 10లోకి అడుగుపెట్టనున్నారనే వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 13 గేమ్స్‌తో సాగిన ఓ పోటీలో పాల్గొన్న ఝాన్సీ.. చివరి రౌండ్‌లో అమన్‌తో పోటీ పడి విజయం సాధించినట్లు సమాచారం. దీంతో బిగ్‌బాస్ తెలుగు 10లోకి ఎంట్రీ టికెట్‌ను ఝాన్సీ సొంతం చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ పోటీలో గెలిచి బిగ్‌బాస్ హౌస్‌లో తన సీటును ఖరారు చేసుకున్నారనే ప్రచారం జరుగుతోంది.
సింగర్‌గా ఇప్పటికే గుర్తింపు తెచ్చుకున్న ఝాన్సీ బిగ్‌బాస్ హౌస్‌లోకి వస్తే షోకు మరింత వైవిధ్యం వచ్చే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. ఆమె గేమ్ ఎలా ఆడతారు? తోటి కంటెస్టెంట్లతో ఎలా కలిసిపోతారు? అనే ఆసక్తి కూడా మొదలైంది. అయితే ప్రస్తుతం ఇవన్నీ గాసిప్స్, రూమర్స్ మాత్రమే. బిగ్‌బాస్ టీమ్ అధికారికంగా ప్రకటించే వరకు ఝాన్సీ ఎంట్రీపై స్పష్టత రాదు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!