

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 రెండో వారం మరింత ఆసక్తికరంగా కొనసాగుతోంది. మొదటి వారం ఇద్దరు కంటెస్టెంట్స్ ఓటింగ్‌తో సంబంధం లేకుండా ఎలిమినేట్ కావడం చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో, ఇప్పుడు రెండో వారం ఎలిమినేషన్‌పై ఉత్కంఠ నెలకొంది. ఈ వారం షాలినీ పటేల్, త్రిగుణ్, ఝాన్సీ, దేబ్జానీ, రాంప్రసాద్, ముఖేష్, కృష్ణుడు, సుధీర్, సృష్టి, వర్షిణి, రోహిత్‌లు నామినేషన్స్‌లో ఉన్నారు. అమన్, వంశీ, నరేష్ నామినేషన్స్ నుంచి తప్పించుకున్నారు.
ప్రస్తుతం అందుతున్న ఓటింగ్ ట్రెండ్స్ ప్రకారం త్రిగుణ్ మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. మొదటి వారం టాప్‌లో ఉన్న రోహిత్‌ను ఈసారి త్రిగుణ్ వెనక్కి నెట్టినట్లు తెలుస్తోంది. అయితే ఇద్దరి మధ్య ఓట్ల తేడా చాలా స్వల్పంగా ఉండటంతో రాబోయే రోజుల్లో ర్యాంకులు మారే అవకాశం ఉంది. ముఖేష్ మూడో స్థానంలో, రామ్ ప్రసాద్ నాలుగో స్థానంలో, సుధీర్ ఐదో స్థానంలో కొనసాగుతున్నట్లు సమాచారం. షాలినీ, దేబ్జానీ, సృష్టి, ఝాన్సీ తర్వాత వర్షిణి, కృష్ణుడు ఉన్నారు. వీరిద్దరి మధ్య కూడా ఓటింగ్ తేడా తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కృష్ణుడు డేంజర్ జోన్‌లో ఉన్నట్లు, ఇదే ఓటింగ్ ట్రెండ్ కొనసాగితే ఆయన ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని కథనాలు చెబుతున్నాయి. అయితే తుది ఫలితం ఓటింగ్ పూర్తయ్యాకే స్పష్టమవుతుంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!