

పప్పెట్ ఎవరు? మ్యానిపులేటర్ ఎవరు? హౌస్‌లో ఎవరు ఎవరిని ఆడిస్తున్నారు? ఎవరు సొంతంగా గేమ్ ఆడుతున్నారు.. ఎవరు ఇంకొకరి మాట విని నడుస్తున్నారు? అనే ప్రశ్నలకు బిగ్‌బాస్ హౌస్‌లో నాగార్జున సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. కొందరిని స్టోర్ రూమ్‌కు పంపించగా, మరికొందరికి గేమ్‌పై క్లాస్ తీసుకున్నారు. ఇంకొందరికి పప్పెట్, మ్యానిపులేటర్ అనే ట్యాగ్లు కూడా ఇచ్చారు. దీంతో నాగార్జున ఎంట్రీతో హౌస్‌లో కంటెస్టెంట్ల గేమ్‌పై ఆసక్తికర చర్చ మొదలైంది.
నాగార్జున హౌస్‌లోకి అడుగుపెట్టగానే కృష్ణుడు, సృష్టిలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. రోజూ గేమ్ ఆడకుండా ప్రేక్షకుల్లా కూర్చొని చూస్తున్నారని ఇద్దరికీ క్లాస్ తీసుకున్నారు. అంతేకాదు, ఈ రోజు నిజంగానే ప్రేక్షకుల్లా ఉండాలని చెప్పి వారిని స్టోర్ రూమ్‌లోకి పంపించారు. దీంతో బిగ్‌బాస్ ఇంట్లో కూర్చొని షో చూస్తున్నారా? లేక షోలోకి వచ్చి షో చూస్తున్నారా? అనే ఆసక్తికరమైన పరిస్థితి ఏర్పడింది.
ఇక కెప్టెన్సీ టాస్క్‌లో దేబ్జానీ ఓడిపోయినప్పటికీ, నాగార్జున దృష్టిని మాత్రం ఆకర్షించింది. మొదటి నుంచే ఆమెపై నాగార్జున ప్రత్యేకంగా ఫోకస్ పెట్టడం కనిపించింది. హౌస్‌లో కొందరు ఎక్కువగా మాట్లాడటాన్నే గేమ్‌గా భావిస్తుంటే, దేబ్జానీ మాత్రం ప్రశాంతంగా తన గేమ్ తాను ఆడుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కెప్టెన్సీ కప్ దక్కకపోయినా, నాగార్జున నుంచి దేబ్జానీకి ప్రత్యేక ప్రశంసలు లభించినట్లు కనిపించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!