

భారత టెలివిజన్ చరిత్రలోనే తొలిసారి బిగ్‌బాస్ రియాలిటీ షోకు సినిమా నటుడు కాకుండా మాజీ క్రికెటర్ హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బిగ్‌బాస్ బెంగాలీ సీజన్-3కు హోస్ట్‌గా వ్యవహరించనున్నట్లు జియోహాట్‌స్టార్ ప్రత్యేక వీడియో ద్వారా అధికారికంగా ప్రకటించింది. సెప్టెంబర్‌లో తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషల్లో బిగ్‌బాస్ కొత్త సీజన్లు ప్రారంభం కానున్నాయి. తెలుగు బిగ్‌బాస్‌కు నాగార్జున, హిందీకి సల్మాన్ ఖాన్, తమిళానికి విజయ్ సేతుపతి, కన్నడానికి కిచ్చా సుదీప్, మలయాళానికి మోహన్‌లాల్ హోస్ట్‌లుగా కొనసాగనున్నారు.
బిగ్‌బాస్ బెంగాలీ కోసం సౌరవ్ గంగూలీకి సుమారు రూ.125 కోట్లు పారితోషికంగా అందనున్నట్లు సమాచారం. దాదాపు పదేళ్ల విరామం తర్వాత తిరిగి వస్తున్న బెంగాలీ బిగ్‌బాస్‌ను ఘనంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో నిర్వాహకులు గంగూలీని ఎంపిక చేశారు. గతంలో దాదాగిరి అన్‌లిమిటెడ్ క్విజ్ షో ద్వారా హోస్ట్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న గంగూలీ, ఇప్పుడు బిగ్‌బాస్ వేదికపై ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!