

బిగ్‌బాస్ తెలుగు 10లో కంటెస్టెంట్‌గా కొనసాగుతున్న త్రిగుణ్‌కు సంబంధించిన పాత ఇంటర్వ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఇంటర్వ్యూలో యాంకర్ బిగ్‌బాస్ షోలో పాల్గొనేందుకు ఎప్పుడైనా ఆహ్వానం వచ్చిందా అని ప్రశ్నించగా, అన్ని సీజన్లకు తనకు ఆహ్వానాలు వచ్చాయని త్రిగుణ్ చెప్పినట్లు తెలుస్తోంది. అయితే తాను బిగ్‌బాస్‌కు వెళ్లాలని ఎప్పుడూ అనుకోలేదని ఆయన అప్పట్లో పేర్కొన్నారు.
బిగ్‌బాస్ షోను చూస్తానని, కానీ తాను వెళ్లి అక్కడ గేమ్ ఆడలేనని త్రిగుణ్ చెప్పాడు. ఒకే చోట తనను లాక్ చేసి ఉంచితే రూ.10 కోట్లు ఇచ్చినా అక్కడ ఉండలేనని, అవసరమైతే ఎదురు డబ్బులు ఇచ్చి బయటకు వచ్చేస్తానని వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం త్రిగుణ్ అదే బిగ్‌బాస్ హౌస్‌లో ఉండటంతో ఆయన పాత వ్యాఖ్యలు మళ్లీ తెరపైకి వచ్చాయి. దీంతో సోషల్ మీడియాలో నెటిజన్లు ఆ పాత వ్యాఖ్యలను ప్రస్తుత పరిస్థితితో పోల్చుతూ ట్రోలింగ్ చేస్తున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!