

టీమిండియా మాజీ కెప్టెన్, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ చిన్న కుమారుడు అన్వయ్ ద్రవిడ్ తన బ్యాటింగ్‌తో క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. వినూ మంకడ్ ట్రోఫీ అండర్-19 టోర్నీలో ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో కర్ణాటక జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన అన్వయ్ కేవలం 41 బంతుల్లోనే 85 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో ఐదు సిక్సర్లు, ఏడు ఫోర్లు బాది 207.32 స్ట్రైక్‌రేట్‌తో పరుగులు సాధించాడు. వికెట్ కీపర్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్న అన్వయ్, అవసరమైన సమయంలో దూకుడుగా ఆడుతూ జట్టుకు భారీ స్కోరు అందించడంలో కీలక పాత్ర పోషించాడు.
ఇటీవల చండీగఢ్‌తో జరిగిన మ్యాచ్‌లో 62 బంతుల్లో 104 పరుగులతో సెంచరీ సాధించిన అన్వయ్.. ఢిల్లీపై మరోసారి తన ఫామ్‌ను కొనసాగించాడు. ఈ మ్యాచ్‌లో ధ్రువ్ కృష్ణ కూడా 51 బంతుల్లో 103 పరుగులు చేసి శతకంతో మెరిశాడు. దీంతో కర్ణాటక జట్టు 49 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 418 పరుగులు సాధించింది. 419 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు 220 పరుగులకే ఆలౌటైంది. దీంతో కర్ణాటక 198 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. వరుసగా అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడుతున్న అన్వయ్.. తన బ్యాటింగ్, వికెట్ కీపింగ్, కెప్టెన్సీతో అండర్-19 క్రికెట్‌లో ప్రత్యేక గుర్తింపు పొందుతున్నాడు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!