

ఆసియా క్రీడలు 2026లో భారత క్రీడాకారులు పలు విభాగాల్లో సత్తా చాటారు. పురుషుల బ్యాడ్మింటన్ జట్టు క్వార్టర్‌ఫైనల్లో ఆతిథ్య జపాన్‌ను 3-0తో ఓడించి సెమీఫైనల్‌కు దూసుకెళ్లడంతోపాటు పతకాన్ని ఖాయం చేసుకుంది. తొలి మ్యాచ్‌లో లక్ష్యసేన్ ప్రపంచ టాప్ ప్లేయర్ కొడై నరోకాపై తొలి గేమ్ కోల్పోయినా అద్భుతంగా పుంజుకుని 11-21, 21-5, 21-19తో విజయం సాధించాడు. అనంతరం సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడీ 21-18, 24-22తో విజయం సాధించగా, ఆయుష్ శెట్టి 21-10, 21-19తో కొకి వటనబెను ఓడించి భారత్‌కు 3-0 విజయాన్ని అందించాడు. అయితే మహిళల బ్యాడ్మింటన్ జట్టు జపాన్ చేతిలో 1-3తో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.
హాకీలో భారత పురుషుల జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. శ్రీలంకను 16-1తో ఓడించిన భారత్.. అంతకుముందు ఇండోనేసియాపై 13-1తో గెలిచింది. శ్రీలంకపై జుగ్‌రాజ్ సింగ్ నాలుగు గోల్స్ చేయగా, అభిషేక్, దిల్‌ప్రీత్ సింగ్ హ్యాట్రిక్‌లు సాధించారు. వుషులో మహిళల 60 కేజీల విభాగంలో రోషిబినా దేవి మకావ్‌కు చెందిన చుమన్ సిన్‌పై 5-0తో విజయం సాధించి సెమీఫైనల్‌కు చేరడంతో పతకం ఖాయమైంది. జిమ్నాస్టిక్స్‌లో ప్రణతి నాయక్ వాల్ట్ ఫైనల్‌కు అర్హత సాధించింది. బాక్సింగ్‌లో సాక్షి చౌదరి, జాదుమణి సింగ్ తమ విభాగాల్లో తదుపరి రౌండ్‌కు చేరారు. మరోవైపు షూటింగ్‌లో ఇలవేనిల్ వలరివాన్-పార్థ్ మానే జోడీ నాలుగో స్థానంతో సరిపెట్టుకోగా, టేబుల్ టెన్నిస్‌లో భారత పురుషుల, మహిళల జట్లు ఓటములతో నిష్క్రమించాయి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!