

న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. వన్డేల్లో న్యూజిలాండ్‌పై అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో 28 బంతులు ఎదుర్కొన్న రోహిత్.. 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 23 పరుగులు చేశాడు. ఈ క్రమంలో తన సిక్సర్ల సంఖ్యను 51కి పెంచుకున్నాడు. ఇప్పటివరకు ఈ రికార్డు పాకిస్థాన్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది (50) పేరిట ఉండేది. రోహిత్ అతడి రికార్డును అధిగమించాడు. ఈ జాబితాలో వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ 45 సిక్సర్లతో మూడో స్థానంలో ఉన్నాడు.
మరోవైపు అంతర్జాతీయ క్రికెట్‌లో న్యూజిలాండ్‌పై అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో క్రిస్ గేల్ 87 సిక్సర్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. రోహిత్ శర్మ 85 సిక్సర్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ప్రస్తుత వన్డే సిరీస్‌లో రోహిత్ మరో మూడు మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉండటంతో గేల్ రికార్డును కూడా అధిగమిస్తాడేమోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!