
షోస్

968 రోజుల విరామం తర్వాత వన్డే జట్టులోకి తిరిగి వచ్చిన టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా, ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో అద్భుత ప్రదర్శనతో రెండు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ వికెట్‌ను పడగొట్టిన బుమ్రా, ఇంగ్లాండ్ గడ్డపై వన్డేల్లో 31 వికెట్లు సాధించిన తొలి భారత బౌలర్‌గా నిలిచాడు. దీంతో రవీంద్ర జడేజా పేరిట ఉన్న 30 వికెట్ల రికార్డును అధిగమించాడు.
అదే మ్యాచ్‌లో బుమ్రా తన వన్డే కెరీర్‌లో 150 వికెట్ల మైలురాయిని కూడా చేరుకున్నాడు. కేవలం 4,605 బంతుల్లో ఈ ఘనత సాధించి, అత్యంత వేగంగా 150 వన్డే వికెట్లు తీసిన భారత బౌలర్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో మహ్మద్ షమీ (4,070 బంతులు), కుల్దీప్ యాదవ్ (4,513 బంతులు) తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!