

ఆసియా క్రీడల్లో మిక్స్‌డ్ 4×400 మీటర్ల రిలేలో రజత పతకం సాధించిన భారత జట్టులోని తమిళనాడు అథ్లెట్లు విద్య రామరాజ్, విశాల్ టీ.కే.లకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ చెరో రూ.50 లక్షల నగదు ప్రోత్సాహకాన్ని ప్రకటించారు. విద్య రామరాజ్, విశాల్ టీ.కే., ఎం.ఆర్. పూవమ్మ, మను టీ.ఎస్.లతో కూడిన భారత జట్టు 3:14.46 సెకన్లలో రేసును పూర్తి చేసి రజతం సాధించింది. బహ్రెయిన్ 3:12.87 సెకన్ల గేమ్స్ రికార్డుతో స్వర్ణం గెలుచుకుంది.
తమిళనాడు స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ అథారిటీకి చెందిన ఎలైట్ స్పోర్ట్స్‌పర్సన్ స్కీమ్ కింద విద్య, విశాల్ ఈ నగదు ప్రోత్సాహకాన్ని అందుకోనున్నారు. వీరి విజయాన్ని సీఎం విజయ్ అభినందిస్తూ, తమిళనాడుకు ఇది గర్వకారణమని పేర్కొన్నారు. ఇటీవలే ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన భారత మహిళల టీ20 జట్టులో సభ్యురాలైన జి. కమలినికి కూడా సీఎం విజయ్ రూ.75 లక్షల నగదు ప్రోత్సాహకం ప్రకటించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!