

ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వకపోవడంపై వస్తున్న విమర్శలకు టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డస్కాటే స్పందించారు. అంతర్జాతీయ క్రికెట్ ఆడే ప్రతిభ వైభవ్‌కు పూర్తిగా ఉందని స్పష్టం చేసిన ఆయన, జట్టులోని ఇతర ఆటగాళ్ల మాదిరిగానే అతడూ తన అవకాశానికి సంబంధించిన ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఇటీవల టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టులో సంజు శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ వంటి ఆటగాళ్లు ఉండటంతో వారికి కూడా వరుస అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని వివరించారు.
ఈ ఏడాది ఐపీఎల్లో వైభవ్ సూర్యవంశీ అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. అత్యధిక పరుగులు సాధించి 'మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్', 'ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్' అవార్డులు అందుకున్నాడు. జూలై 1 నుంచి ప్రారంభమయ్యే ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌లో అతడికి అరంగేట్రం చేసే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. ఒకవేళ జట్టులో చోటు దక్కితే, భారత తరఫున అత్యంత పిన్న వయసులో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన ఆటగాడిగా కొత్త చరిత్ర సృష్టించే అవకాశం ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!