

విక్టరీ వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందుతున్న ‘ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47 (ఏకే–47)’ చిత్రంపై సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఎన్నో ఏళ్లుగా అభిమానులు ఎదురుచూస్తున్న ఈ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తుండగా, నాగవంశీ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.
ఇటీవల విడుదలైన ‘బ్లాస్ట్ జోన్’ చిత్ర కథకు, ‘ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47’ కథకు కొన్ని పోలికలు ఉన్నాయనే ప్రచారం సినీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఎలాంటి విమర్శలకు తావు లేకుండా కథలో కొన్ని కీలక మార్పులు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంపై చిత్ర బృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం ఈ ప్రచారం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చర్చనీయాంశంగా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!