

మసూరీలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన రాధా గాయత్రి కేసు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. రాధా గాయత్రి తల్లిదండ్రులు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితను కలిసి తమ కుమార్తె మరణంపై ఉన్న అనుమానాలను వివరించారు. ముఖ్యంగా అల్లుడు శ్రీచరణ్ ప్రవర్తనపై అనుమానాలు వ్యక్తం చేస్తూ, ఈ కేసులో న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికే అక్కడి పోలీసులతో ఇన్‌చార్జ్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మాట్లాడి వివరాలు సేకరించినట్లు హోంమంత్రి తెలిపారు.
హోంమంత్రి అనిత మాట్లాడుతూ ఈ కేసుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా దృష్టి సారించారని తెలిపారు. ఉత్తరాఖండ్ డీజీపీతో మాట్లాడాలని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌కు సూచించినట్లు వెల్లడించారు. కుటుంబ సభ్యుల అనుమానాలను పరిగణనలోకి తీసుకొని నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే రాధా గాయత్రి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని భరోసా ఇచ్చారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!