
జనరల్

జర్మనీ చేతిలో 7-1 తేడాతో ఓడిపోయినప్పటికీ, కురసావోకు ఈ మ్యాచ్ ఫలితానికి మించిన చారిత్రక ప్రాధాన్యం ఉంది. ఫిఫా వరల్డ్‌కప్‌లో తొలిసారి అడుగుపెట్టిన ఈ కరీబియన్ దేశం తరఫున లివానో కోమెనెన్సియా తొలి వరల్డ్‌కప్ గోల్ నమోదు చేసి చరిత్ర సృష్టించాడు. కేవలం లక్షా యాభై వేల జనాభా ఉన్న చిన్న దేశానికి ఇది ఫుట్‌బాల్ ప్రపంచంలో చిరస్మరణీయ ఘట్టంగా నిలిచింది.
కురసావో విజయవంతమైన ప్రయాణం వెనుక 78 ఏళ్ల డిక్ అడ్వొకాట్ కీలక పాత్ర పోషించారు. ఫిఫా వరల్డ్‌కప్ మ్యాచ్‌కు కోచింగ్ ఇచ్చిన అత్యంత వయసు కలిగిన కోచ్‌గా ఆయన రికార్డు సృష్టించారు. 2025లో జట్టును తొలిసారి వరల్డ్‌కప్‌కు అర్హత సాధింపజేసిన ఆయన, వ్యక్తిగత కారణాలతో కొంతకాలం దూరమైనప్పటికీ మళ్లీ జట్టుతో చేరారు. మ్యాచ్‌కు ముందు భావోద్వేగానికి గురైన అడ్వొకాట్, ఫలితం ఎలా ఉన్నా తమ జట్టు గర్వపడే ప్రదర్శన చేసిందని పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!