

ఆస్ట్రేలియా-ఎతో జరుగుతున్న నాలుగు రోజుల మ్యాచ్‌లో భారత్-ఎ విజయానికి చేరువైంది. దేవదత్ పడిక్కల్ సారథ్యంలోని భారత్-ఎ జట్టు ప్రత్యర్థి ముందు 363 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా-ఎ 55/2తో నిలిచింది. దీంతో చివరి రోజు విజయానికి కంగారూ జట్టు మరో 308 పరుగులు చేయాల్సి ఉంది. భారత స్పిన్నర్లను ఆస్ట్రేలియా బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారన్నది ఆసక్తికరంగా మారింది.
తొలి ఇన్నింగ్స్‌లో 163 పరుగుల ఆధిక్యం సాధించిన భారత్-ఎ.. రెండో ఇన్నింగ్స్‌లో 199 పరుగులకు ఆలౌటైంది. ఒక దశలో 93/1తో ఉన్న భారత్.. ఆఫ్‌స్పిన్నర్ టాడ్ మర్ఫీ (4/44), లియామ్ స్కాట్ (2/22) బౌలింగ్‌లో వరుసగా వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ పడిక్కల్ 59 పరుగులతో రాణించగా.. కుమార్ కుశాగ్ర 46 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. సాయి సుదర్శన్ 39 పరుగులు చేశాడు. అంతకుముందు భారత్-ఎ తొలి ఇన్నింగ్స్‌లో 334 పరుగులు చేయగా.. ఆస్ట్రేలియా-ఎ 171 పరుగులకే ఆలౌటైంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!