

భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI), ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు (ACB) సంయుక్తంగా భారత్-ఆఫ్ఘనిస్థాన్ మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను అధికారికంగా ఖరారు చేశాయి. సెప్టెంబర్ 13 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. మూడు మ్యాచ్‌లూ న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలోనే జరగనున్నాయి. సెప్టెంబర్ 13, 15, 17 తేదీల్లో మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. విశేషం ఏమిటంటే.. మ్యాచ్‌లు భారత్‌లో జరిగినప్పటికీ ఆఫ్ఘనిస్థాన్ అధికారికంగా ఆతిథ్య జట్టుగా వ్యవహరించనుంది. భారత్ గడ్డపై ఆఫ్ఘనిస్థాన్ తొలిసారి టీమ్‌ఇండియాకు ఆతిథ్యం ఇవ్వనుంది.
భద్రత, ఇతర పరిస్థితుల కారణంగా ఆఫ్ఘనిస్థాన్ జట్టు గతంలోనూ తమ అంతర్జాతీయ ‘హోమ్’ మ్యాచ్‌లను విదేశాల్లో నిర్వహించింది. భారత్ కూడా ఆఫ్ఘన్ క్రికెట్ అభివృద్ధికి ఎప్పటి నుంచో సహకరిస్తోంది. ఆఫ్ఘన్ ఆటగాళ్లకు అంతర్జాతీయ స్థాయిలో పోటీ అనుభవం కల్పించేందుకు బీసీసీఐ కట్టుబడి ఉందని అధ్యక్షుడు మిథున్ మన్హాస్ తెలిపారు. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా కూడా ఈ సిరీస్‌పై సంతోషం వ్యక్తం చేశారు. ఈ సిరీస్ ఖరారుతో ప్రతిపాదిత భారత్-బంగ్లాదేశ్ పర్యటనపై అనిశ్చితి నెలకొంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!