23, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కొలంబోలో రెండో టెస్టులో క్లీన్‌స్వీప్‌పై గిల్ సేన కన్ను...

Writer: Chandrika 08:03 AM, 23 ఆగస్టు, 2026
కొలంబోలో రెండో టెస్టులో  క్లీన్‌స్వీప్‌పై గిల్ సేన కన్ను...

శ్రీలంకతో జరుగుతున్న రెండు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉన్న టీమ్‌ఇండియా.. రెండో టెస్టుకు సిద్ధమైంది. కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్‌లో ఆదివారం నుంచి ఈ మ్యాచ్ జరగనుంది. తొలి టెస్టులో 165 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన శుభ్‌మన్ గిల్ బృందం.. రెండో మ్యాచ్‌లోనూ ఆధిపత్యం కొనసాగించి సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకోవాలని భావిస్తోంది. 2023 జులైలో వెస్టిండీస్‌పై సిరీస్ గెలిచిన తర్వాత విదేశీ గడ్డపై భారత్‌కు టెస్టు సిరీస్ విజయం దక్కలేదు. దీంతో కొలంబో విజయం గిల్ సేనకు ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది.

తొలి టెస్టులో భారత బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలు సమష్టిగా రాణించాయి. దేవదత్ పడిక్కల్ అద్భుతమైన 167 పరుగులతో తొలి టెస్టు శతకాన్ని నమోదు చేయగా.. కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, ధ్రువ్ జురెల్ కూడా కీలక పరుగులు చేశారు. అయితే కొలంబోలో కెప్టెన్ శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్ నుంచి భారీ ఇన్నింగ్స్‌లను జట్టు ఆశిస్తోంది. ముఖ్యంగా ఎడమచేతి వాటం స్పిన్నర్ల బౌలింగ్‌లో తన బలహీనతను అధిగమించేందుకు గిల్ ప్రత్యేకంగా సాధన చేశాడు. తొలి టెస్టులో 10 వికెట్లు తీసిన మానవ్ సుతార్, రవీంద్ర జడేజా మరోసారి ప్రభావం చూపాలని భారత్ కోరుకుంటోంది.

మరోవైపు తొలి టెస్టులో ఓటమిపాలైన శ్రీలంక.. సొంతగడ్డపై సిరీస్‌ను సమం చేయాలంటే ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సి ఉంటుంది. భారత బౌలింగ్‌ను ఎదుర్కోవాలంటే ఆ జట్టు టాప్ ఆర్డర్ మెరుగైన ప్రదర్శన చేయాల్సి ఉంది. అయితే కీలక బ్యాటర్లు కుశాల్ మెండిస్, దినేశ్ చండిమాల్ రెండో టెస్టుకు దూరమయ్యారు. పాథుమ్ నిస్సాంక కూడా అందుబాటులో లేకపోవడం లంకకు మరింత ప్రతికూలంగా మారింది.

గాలెతో పోలిస్తే కొలంబో పిచ్ బ్యాటింగ్‌కు కొంత అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. మ్యాచ్ సాగుతున్న కొద్దీ స్పిన్నర్లకు కూడా సహకారం లభించవచ్చని అంచనా. తొలి టెస్టులో ఆధిక్యం సాధించిన భారత్ సిరీస్‌ను కైవసం చేసుకోవాలని చూస్తుండగా.. శ్రీలంక మాత్రం సిరీస్ సమం చేసేందుకు చివరి ప్రయత్నం చేయనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్రపంచ  బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో గాయత్రి-ట్రీసా జోడీకి కాంస్యం..

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో గాయత్రి-ట్రీసా జోడీకి కాంస్యం..

అర్జున అవార్డు గ్రహీత ధనుష్ శ్రీకాంత్‌కు ఘన సన్మానం

అర్జున అవార్డు గ్రహీత ధనుష్ శ్రీకాంత్‌కు ఘన సన్మానం

వైరల్ వికెట్ సెలబ్రేషన్‌తో మెహద్వీ బిధూరి.. నెట్టింట ఫుల్ క్రేజ్!

వైరల్ వికెట్ సెలబ్రేషన్‌తో మెహద్వీ బిధూరి.. నెట్టింట ఫుల్ క్రేజ్!

చైనా జోడీకి షాకిచ్చిన గాయత్రీ-ట్రీసా..,

చైనా జోడీకి షాకిచ్చిన గాయత్రీ-ట్రీసా..,

క్వార్టర్‌ ఫైనల్లోనే ముగిసిన సాత్విక్‌-చిరాగ్‌ పతక ఆశలు
ట్యాగ్లు
భారత్ వర్సెస్ శ్రీలంకటీమ్ ఇండియాశ్రీలంక క్రికెట్శుభ్‌మన్ గిల్యశస్వి జైస్వాల్రెండో టెస్టుకొలంబో టెస్టుటెస్టు క్రికెట్మానవ్ సుతార్ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్
Advertisement

క్వార్టర్‌ ఫైనల్లోనే ముగిసిన సాత్విక్‌-చిరాగ్‌ పతక ఆశలు

లాసాన్ డైమండ్ లీగ్.. రెండో స్థానంలో నీరజ్ చోప్రా

లాసాన్ డైమండ్ లీగ్.. రెండో స్థానంలో నీరజ్ చోప్రా

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కొలంబోలో రెండో టెస్టులో  క్లీన్‌స్వీప్‌పై గిల్ సేన కన్ను...
క్రీడలు

కొలంబోలో రెండో టెస్టులో క్లీన్‌స్వీప్‌పై గిల్ సేన కన్ను...

అనసూయకు నటి హేమ కౌంటర్!
జనరల్

అనసూయకు నటి హేమ కౌంటర్!

ప్రపంచ  బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో గాయత్రి-ట్రీసా జోడీకి కాంస్యం..
క్రీడలు

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో గాయత్రి-ట్రీసా జోడీకి కాంస్యం..

కొండా సురేఖ వ్యవహారంపై క్రమశిక్షణ కమిటీ కీలక సమీక్ష...
రాజకీయాలు

కొండా సురేఖ వ్యవహారంపై క్రమశిక్షణ కమిటీ కీలక సమీక్ష...

బీఆర్ఎస్‌కు రాజకీయ భవిష్యత్తు లేదు: బండ్ల గణేశ్
రాజకీయాలు

బీఆర్ఎస్‌కు రాజకీయ భవిష్యత్తు లేదు: బండ్ల గణేశ్

రవితేజ కుమార్తె మోక్షధకు ‘ఇరుముడి’లో ప్రత్యేక క్రెడిట్?
గాసిప్స్

రవితేజ కుమార్తె మోక్షధకు ‘ఇరుముడి’లో ప్రత్యేక క్రెడిట్?

19 నెలల్లో అమెరికా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాం: ట్రంప్
జనరల్

19 నెలల్లో అమెరికా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాం: ట్రంప్

బీజేపీపై కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు...
రాజకీయాలు

బీజేపీపై కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు...

ఫోక్ ఇండస్ట్రీపై తప్పుడు ఆరోపణలు చేయొద్దు’ -జాను లిరి
జనరల్

ఫోక్ ఇండస్ట్రీపై తప్పుడు ఆరోపణలు చేయొద్దు’ -జాను లిరి

తెలంగాణ టెక్‌ రంగానికి భారీ బూస్ట్...హైదరాబాద్‌లో AWS బిల్డర్ లోఫ్ట్‌
టెక్నాలజీ

తెలంగాణ టెక్‌ రంగానికి భారీ బూస్ట్...హైదరాబాద్‌లో AWS బిల్డర్ లోఫ్ట్‌

రాహుల్ గాంధీపై స్మృతి ఇరానీ ఫైర్..
రాజకీయాలు

రాహుల్ గాంధీపై స్మృతి ఇరానీ ఫైర్..

సినిమాల కంటే యూట్యూబ్‌లోనే ఎక్కువ సంపాదిస్తున్నా- ఫరా ఖాన్
సినిమాలు

సినిమాల కంటే యూట్యూబ్‌లోనే ఎక్కువ సంపాదిస్తున్నా- ఫరా ఖాన్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!